ఫోన్​ టీవీదే భవిష్యత్తు.!

phone-tv-market-in-india

మనదేశంలో ఫోన్‌‌ టీవీతోపాటు సాధారణ టీవీకీ మంచి భవిష్యత్‌‌ ఉందని ప్రైస్‌‌ వాటర్‌‌హౌజ్‌‌ కూపర్స్‌‌ స్టడీ వెల్లడించింది. ఇండియాలో ఫోన్‌‌ టీవీ మార్కెట్‌‌ 2023 నాటికి మార్కెట్‌‌ మూడురెట్లు పెరిగి రూ.11,976 కోట్లకు చేరుతుందని తెలిపింది. అందుకే ఫోన్‌‌ టీవీ ప్రొవైడర్లు కంటెంట్‌‌ను పెంచడానికి కృషి చేస్తున్నారని పేర్కొంది. ‘అందరికీ టెల్కో సేవలు అందుబాటులోకి రావడం, తక్కువ ధరకు డేటా దొరకడం వల్ల ఇంటర్నేషనల్‌‌ ఫోన్‌‌ టీవీ ప్రొవైడర్లకు ఇండియా ఆకర్షణీయమైన మార్కెట్‌‌గా మారింది’ అని విశ్లేషించింది.  భవిష్యత్‌‌లోనూ ప్రజలను ఆకట్టుకోగలిగిన శక్తి టీవీకి ఉందని పీడబ్ల్యూసీ స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: ఇప్పుడు చాలా మందికి నిత్యం అమెజాన్‌‌ ప్రైమ్‌‌, హాట్‌‌స్టార్‌‌, నెట్‌‌ఫ్లిక్స్‌‌ వంటి ఓవర్‌‌ ది టాప్ ( ఓటీటీ) సర్వీసుల్లో సినిమాలు, ఒరిజనల్‌‌ షోలు చూడందే తెల్లారడం లేదు. ముఖ్యంగా నగరాల్లో ఫోన్‌‌టీవీ చూసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అందుకే ఫోన్‌‌ టీవీ యాప్స్‌‌ చాలా ఆదరణ పొందుతున్నాయి. మరింత మంది యూజర్లను ఆకట్టుకోవడానికి ఇవి పెద్ద ఎత్తున ఒరిజనల్‌‌ షోలను నిర్మిస్తున్నాయి. అమెజాన్‌‌ ప్రైమ్‌‌ మొత్తం 16 ఒరిజనల్స్‌‌ను నిర్మించగా, వీటిలో ఏడు షోలు ఇండియా మార్కెట్‌‌ కోసమే కావడం గమనార్హం. మరో ఫోన్‌‌ టీవీ ప్రొవైడర్‌‌ నెట్‌‌ఫ్లిక్స్ మన దేశ మార్కెట్‌‌ కోసం తొమ్మిది ఒరిజనల్‌‌ షోలను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. హాట్‌‌స్టార్‌‌ కూడా కొన్ని కొత్త ఒరిజనల్‌‌ షోలను ప్రసారం చేయనుంది.

ఇండియాలో ఫోన్‌‌టీవీ మార్కెట్‌‌కు మంచి భవిష్యత్‌‌ ఉందని, 2023 నాటికి వీటి మార్కెట్‌‌ మూడురెట్లు పెరిగి రూ.11,976 కోట్లకు చేరుతుందని  పీడబ్ల్యూసీ ఇండియా (ప్రైస్‌‌ వాటర్‌‌హౌజ్‌‌ కూపర్స్‌‌) స్టడీ వెల్లడించింది. అందుకే ఫోన్‌‌ టీవీ ప్రొవైడర్లు కంటెంట్‌‌ను పెంచడానికి కృషి చేస్తున్నారు. ‘‘అందరికీ టెల్కో సేవలు అందుబాటులోకి రావడం, తక్కువ ధరకు డేటా దొరకడం వల్ల ఇంటర్నేషనల్‌‌ ఓటీటీ ప్రొవైడర్లకు ఇండియా ఆకర్షణీయమైన మార్కెట్‌‌గా మారింది. తక్కువ ధరకు సబ్‌‌స్క్రిప్షన్‌‌ ఇవ్వడం, ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌‌ ఇవ్వడం, బండిల్డ్ ప్యాకేజ్‌‌లు, సబ్‌‌స్క్రిప్షన్‌‌ వీడియో ఆన్ డిమాండ్‌‌ (ఎస్‌‌వీఓడీ) వంటివి వీటికి ఆదరణను పెంచుతున్నాయి. అందుకే గత ఏడాది ఫోన్‌‌ టీవీ మార్కెట్‌‌ 64 శాతం వృద్ధి సాధించింది’’ అని పీడబ్ల్యూసీ ఇండియా ఉన్నతాధికారి రాజీవ్‌‌ బసు అన్నారు.

మరి టీవీ పరిస్థితి ఏంటి ?
ఫోన్‌‌ టీవీలు ప్రసారం గేమ్‌‌ ఆఫ్‌‌ థోర్న్స్‌‌, సేక్రెడ్‌‌ గేమ్స్‌‌ వంటి షోలకు మనదేశంలో క్రేజ్‌‌ పెరుగుతున్న మాట నిజం. అమెరికా వంటి ధనిక దేశాల్లో అయితే టీవీ మార్కెట్‌‌ను ఫోన్‌‌ టీవీలు దెబ్బతీస్తున్నాయి. ఇండియాలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదని పీడబ్ల్యూసీ ఇండియా విశ్లేషించింది. ఇక నుంచి కూడా టీవీ మనదేశంలో రాజ్యమేలుతుందని స్పష్టం చేసింది. ఇండియాలో గత ఏడాది సబ్‌‌స్క్రిప్షన్లలో ఫోన్‌‌ టీవీల వాటా ఐదుశాతం. అమెరికాలో ఫోన్‌‌ టీవీల సబ్‌‌స్క్రిప్షన్‌‌ రాబడి 11 శాతం కాగా, టీవీ మార్కెట్‌‌ 79 శాతం వృద్ధి నమోదు చేసింది. 2014లో ఇది 87 శాతం ఉండేది. ఇక్కడ 2023 నాటికి టీవీ సబ్‌‌స్క్రిప్షన్‌‌ రెవెన్యూ 70 శాతానికి పడిపోతుందని అంచనా. ఇండియాలో 2023 నాటికి టీవీ సబ్‌‌స్క్రిప్షన్‌‌ రెవెన్యూ వాటా 81 శాతం, ఫోన్‌‌టీవీల రెవెన్యూవాటా ఎనిమిది శాతం నమోదవుతుందని పీడబ్ల్యూసీ అంచనా వేసింది. మనదేశంలో భవిష్యత్‌‌లోనూ ప్రజలను ఆకర్షించగల శక్తి టీవీ చానెళ్లకు ఉందని, అమెరికాలో ఈ పరిస్థితి లేదని వివరించింది.

పెరగనున్న టీవీ ప్రకటనలు
ఈ స్టడీ ప్రకారం.. ఇండియా టీవీ అడ్వర్టైజింగ్‌‌ రంగం 2023 నాటికి టాప్ మార్కెట్లలో ఒకటిగా మారనుంది. ఇంగ్లండ్‌‌, జర్మనీ, ఫ్రాన్స్‌‌, బ్రెజిల్‌‌ మార్కెట్లను అధిగమిస్తుంది. దీంతో టీవీ వాణిజ్య ప్రకటనలు ఇంకా పెరుగుతాయి. ఈ రంగం ఏటా 11 % కంపౌండ్‌‌ అన్యువల్‌‌ గ్రోత్‌‌ రేట్‌‌ (సీఏజీఆర్‌‌)ను సాధిస్తుంది. టీటీ, ఇంటర్నెట్‌‌ యాడ్స్‌‌, ఈ–స్పోర్ట్స్‌‌, మ్యూజిక్‌‌ వల్ల 2023 నాటికి ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌, మీడియా ఇండస్ట్రీ మార్కెట్‌‌ విలువ రూ.4 లక్షల 50 కోట్లకు చేరుతుంది. 2017 నుంచి ఇంటర్నెట్‌‌ అడ్వర్టైజింగ్‌‌ ఏటా 40 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. గత ఏడాది ఈ పరిశ్రమ మార్కెట్‌‌ విలువ 1.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.11 వేల కోట్లు) చేరింది. 2023 నాటికి ఇది 2.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.18 వేల కోట్లు) చేరుతుందని అంచనా. మనదేశంలో మ్యూజిక్‌‌, రేడియో, పోడ్‌‌కాస్ట్‌‌లకు అద్భుత భవిష్యత్‌‌ ఉందని, 2023 నాటికి ఈ రంగాల ఆదాయాలు రూ.10 వేల కోట్లను దాటుతాయని పీడబ్ల్యూసీ తెలిపింది.  96 శాతం మంది స్మార్ట్‌‌ఫోన్ల ద్వారా మ్యూజిక్‌‌ వింటున్నారని ఇంటర్నేషనల్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఫోనోగ్రాఫిక్‌‌ ఇండస్ట్రీ తెలిపింది.

Latest Updates