ప్రత్యేక సంస్థగా ఫోన్ పే

డిజిటల్ పేమెంట్ స్ కంపెనీ ఫోన్‌‌పే ఒక ప్రత్యేక సంస్థగా అవతరిం చబోతోం ది. ఫోన్‌‌పే కార్యకలాపాలను వేరుగా నిర్వహించేందుకు, కొత్త ఓనర్‌ షి ప్‌ కోసం ఫ్లిప్‌ కార్ట్ బోర్డు నుం చి సూత్రప్రాయంగా అనుమతి వచ్చినట్టు సంబంధిత వ్యక్తులు చెప్పా రు. దీంతో బెంగళూరుకు చెందిన ఫోన్‌‌పే స్వతంత్ర బోర్డును నియమించుకుంటుం ది. అంతేకాకుండా,బయట ఇన్వెస్టర్ల నుం చి తాజాగా నిధులు సేకరించాలనుకుంటోందని తెలిసింది. అయితే ఫోన్‌‌పేలో ఉన్న 100 శాతం షేర్‌ హోల్డింగ్‌‌లో ఎంత మొత్తాన్ని వాల్‌‌మార్ట్‌‌కు చెందిన ఫ్లిప్‌ కార్ట్ డిజ్‌‌ఇన్వెస్ట్‌‌మెంట్ చేస్తుందో తెలియలేదు. బయట ఇన్వెస్టర్ల నుంచి100 కోట్ల డాలర్ల వరకు సేకరించాలని ఈ పేమెంట్ స్ సంస్థ చూస్తోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు.

చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్ ,ఆన్‌‌లైన్ రిటైలర్ సహవ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్‌‌ వంటి ఫ్లిప్‌ కార్ట్‌‌ ఇన్వెస్టర్లు ఈ పేమెంట్ సంస్థకు మద్దతుగా నిలుస్తున్నారు. ఫోన్‌‌పే ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పా టయ్యేందుకు ఫ్లిప్‌ కార్ట్ బోర్డు నుంచి అనుమతి లభించింది. నిధులు సేకరించే ప్రక్రియ ఇక ప్రారంభమవుతుంది. పేటీఎం లాంటి డిజి టల్ పేమెంట్స్ కంపెనీలతో పోటీపడాలంటే ఫోన్‌‌పేకు పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. గత కొన్ని వారాల క్రితమే ఈ ప్లాన్‌‌కు బోర్డు అనుమతి ఇచ్చింది అని ఈ విషయం తెలిసి న ఒక వ్యక్తి చెప్పారు. తమ ప్రొడక్ట్‌‌ను ప్రమోట్ చేసుకునేందుకు వచ్చే ఏడాది రూ.500 కోట్లను వెచ్చించనున్నట్టు ఫోన్‌‌పే గతవారం ప్రకటించింది. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే, కంపెనీల పాలసీపై వచ్చే ఊహాగానాలపై తాము ఎలాం టి కామెంట్ చేయమని ఫోన్‌‌పే అధికార ప్రతినిధి చెప్పా రు. ఫ్లిప్‌ కార్ట్ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. ఫ్లిప్‌ కార్ట్ మాజీ ఎగ్జిక్యూ టివ్‌‌లు సమీర్ నిగమ్, రాహుల్ ఛారి, బుర్జిన్ ఇంజనీర్‌ లు కలిసి ఫోన్‌‌పేను స్థాపించారు. ఈ సంస్థను 2016లో ఫ్లిప్‌ కార్ట్ కొనేసింది.

Latest Updates