ముస్లిం యువతి పెళ్లి.. వెడ్డింగ్ కార్డులో సీతారాముల ఫొటో

ఒక ముస్లిం కుటుంబం పరమత సహనాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచింది. తమ ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా వెడ్డింగ్ కార్డులో సీతారాముల ఫొటోను ప్రింట్ చేయించి అందరూ ఒక్కటేనని చాటింది. ఉత్తర ప్రదేశ్ లోని చిలావా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

తమ కుమార్తె రుఖ్సార్ బానో వివాహం సందర్భంగా తల్లిదండ్రులు ఈ విధంగా పత్రికను తయారు చేయించారు. తమ గ్రామంలో హిందూ, ముస్లింలు సోదరభావంతో మెలుగుతుంటారని చెప్పారు. మతసామరస్యం దేశానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే పెళ్లికార్డుపై సీతారాముల ఫొటో ముద్రించామన్నారు. మత పరంగా తాము విడిపోవాలనుకోవడం లేదన్నారు. పెళ్లిపత్రికను చూసి తమ గ్రామస్తులంతా చాలా సంతోషించారని… మా ఆహ్వాన పత్రికను స్వీకరించారని తెలిపారు.

Latest Updates