పెళ్లి రిసెప్షన్లో ఫొటోలు, డ్యాన్సులు: కుటుంబాన్ని బహిష్కరించిన పెద్దలు

  • కేరళలో ఓ పెళ్లి రిసెప్షన్ లో వరుడితో కలిసి వధువు ఫొటోలు
  • స్టేజిపై చిన్న పిల్లల డాన్సులు.. ఆడోళ్ల ఆట పాటలు
  • దాంతో కుటుంబాన్ని బహిష్కరించిన మహల్లు కమిటీ

పెళ్లి అన్నంక రిసెప్షన్ ఉండడం కామన్ ఈ రోజుల్లో. ఫొటోలూ షరా మామూలే. డాన్సులు, ఆటపాటలతో చిందులు తొక్కుతూ కిర్రెక్కించడం ఏ
పెళ్లిలో జరగదు చెప్పండి. కానీ, అవే ఓ కుటుంబం పాలిట శాపమయ్యాయి. మత పెద్దలు ఊరి నుంచి బహిష్కరించేదాకా తీసుకెళ్లాయి. పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి కూతురును నిలబెట్టి బంధువులతో ఫొటోలు దింపించడం మహల్లు కమిటీ పెద్దల కళ్లు ఎరుపెక్కేలా చేశాయి. కేరళలోని పాలక్కడ్ జిల్లా థ్రితలలో నెలన్నర క్రితం జరిగిందీ ఘటన. పెళ్లి కొడుకు అన్న దానిష్ రియాజ్ ఫేస్ బుక్ లో తమ గోడును వెళ్లబోసుకోవడంతో బయటకొచ్చింది.. మత పెద్దలు తీసుకున్న ఈ తీవ్రమైన నిర్ణయం.

‘‘డిసెంబర్ 28న ఎడప్పాల్ లోని ఆడిటోరియంలో మా తమ్ముడు అబ్దుల్ హై రిసెప్షన్ నిర్వహించాం. కొన్ని రోజుల తర్వాత నాలుగు కారణాలు చూపుతూ మా కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్టు మహల్లు కమిటీ తెలిపింది. ‘ఫంక్షన్ లో ఫొటోలకు మహిళలు పోజులివ్వడం. పాటలు పెట్టడం, సంగీత వాయిద్యాలు వాయించడం. స్టేజీమీద చిన్న పిల్లలు డాన్సులు చేయడం. మైక్రోఫోన్ లో మహిళలు మాట్లాడడం’ వంటి కారణాలను  చూపించి మమ్మల్ని బహిష్కరించా రు. మేం కమిటీకి క్షమాపణలు కూడా చెప్పాం . అయినా కూడా వాళ్లు కనికరించలేదు. నిషేధాన్ని ఎత్తేసేది లేదని తేల్చి చెప్పా రు” అని రియాజ్ ఫేస్ బుక్ లో పోస్ట్​ చేశారు.

తమ కుటుంబం ఎప్పుడూ మత విశ్వాసాలు, సంస్కృతులను పాటిస్తుందని, ఏనాడూ మహల్లు కమిటీ నిర్ణయాలను పాటించకుండా ఉండలేదని రియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సింది గా కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం, స్థానిక ఎమ్మెల్యే వీటీ బలరాంను కోరారు. రిసెప్షన్ లో పెట్టిన సంగీత కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనడం షరియాకు వ్యతిరేకమంటూ మత పెద్దలు వాదిస్తున్నారని చెప్పా రు. తమ పక్క ప్రాంతాల్లోని మహల్లు కమిటీలు వాటిని స్వాగతిస్తున్నా , తమ పరిధిలోని మహల్లు కమిటీ మాత్రం
అంగీకరించట్లేదన్నా రు. ప్రజాస్వామ్య దేశంలో ఏ మత సంస్థ కూడా ఇలాంటి నిషేధాలు విధించడం తగదని అన్నా రు. రెండేళ్ల క్రితం తన పెళ్లప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్ డా యని రియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆ కుటుంబంపై ఎలాంటి బహిష్కరణను విధించలేదని మహల్లు కమిటీ సెక్రటరీ అజీస్ అలూర్ అన్నా రు. కానీ, వాళ్లు షరియాను ఉల్లంఘించడాన్ని మాత్రం తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఏ ఒక్కరి కోసమో షరియా రూల్స్​ను మార్చలేమని తేల్చి చెప్పారు.

Latest Updates