మినిస్టర్​ ప్రోగ్రాం… బడికి రాంరాం

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​మండలం పిప్పల్​కోఠి గ్రామంలో మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ  మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి రైతులకు పెట్టుబడి రాయితీ అందించడం, గోపాలమిత్ర భవన ప్రారంభోత్సవం, శ్రీవెంకటేశ్వరాలయ కల్యాణ మండప భూమి పూజ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిప్పల్​కోఠి జడ్పీహెచ్ఎస్​​ స్టూడెంట్లను ఆ కార్యక్రమానికి తీసుకొచ్చారు.

మంత్రి వచ్చేంత వరకు స్టూడెంట్లను ఎండలో నిలబెట్టడమే కాకుండా పిల్లలతో నాయకులపై పూలు చల్లించారు. గంటన్నరకుపైగా సభలో కూర్చోబెట్టారు.  తరగతి గదిలో పాఠాలు వినాల్సిన పిల్లలను సభలో  కూర్చోబెట్టడంపై పలువురి నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

Latest Updates