వెస్పా స్కూటర్లపై ఆఫర్లు

ముంబై: పండగ సీజన్‌‌ను పురస్కరించుకొని పియోజ్యో..తన వెస్పా, ఎప్రిలియా స్కూటర్లపై ఆఫర్లను ప్రకటించింది. ఈ రెండు బ్రాండ్లపై రూ.10 వేల విలువైన ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండు మోడల్స్‌‌కు ఐదేళ్ల వారంటీ ఇస్తారు. వీటిలో రెండేళ్లపాటు సంపూర్ణ వారంటీ ఉంటుంది. మూడేళ్లపాటు ఎక్స్‌‌టెండెడ్‌ వారంటీ ఉంటుంది.ఉచితంగా ఆన్‌‌ రోడ్‌ అసిస్టెన్స్‌‌ పొందవచ్చు.తొలి ఏడాది లేబర్‌‌ చార్జీలు లేకుండా సర్విసింగ్‌ చేస్తారు. పేటీఎం ద్వారా కొంటే రూ.ఆరు వేల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. రెండుమోడల్స్‌‌పై రూ.నాలుగు వేల విలువైన బీమాను ఉచితంగా అందిస్తారు.