సింహాల దయనీయ స్థితి.. కంటతడి పెట్టిస్టున్న ఫొటోలు వైరల్

ఈ ఫోటోల్లో మీకు కనిపించేవి నిజమైన మృగరాజులే. కాకపోతే తినడానికి సరైన ఆహారం లేక బక్క చిక్కి ఇలా ఎముకల గూడులా మారిపోయాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్న ఈ ఆఫ్రికన్ సింహాలు సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని అల్-ఖురేషి అనే జూ పార్కులో ఉన్నాయి. కొన్ని వారాలుగా వాటికి ఆహారం లేక ఆచేతన స్థితిలో పడిపోయాయి. వాటికి చికిత్స చేసేందుకు మందులు కూడా లేకపోవడంతో ఆ సింహాల మనుగడకే ప్రమాదకర స్థితి ఏర్పడింది.

ఉస్మాన్ సలీహ్ అనే ఓ జంతు ప్రేమికుడు అక్కడి సింహాల పరిస్థితి చూసి చలించిపోయాడు. తన వంతు ప్రయత్నంగా సింహాల కోసం.. ఏదైనా చేయాలని వాటి ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఆకలితో ఉన్న ఆ జంతువులకు చేతనైన సహాయం చేయాలని, తన ఫ్రెండ్స్ ను, నెటిజన్లను కోరాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది  నెటిజన్లు ప్రతిస్పందించారు. సలీహ్ చేసిన కృషిని ప్రశంసించారు, ఆ సింహాలను రక్షించేందుకు అతను చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. అనేక మంది వాలంటీర్లు పార్కును సందర్శించి ఆ సింహాలకు ఆహారం రూపంలో, మందుల రూపంలో తమకు తోచిన సాయాన్ని చేశారు.

పార్క్ అధికారులు, పశువైద్యులు దీనిపై వివరణ ఇస్తూ.. గత కొన్ని వారాలుగా సింహాల పరిస్థితి క్షీణించిందని, కొన్ని జంతువులు తీవ్రంగా బరువు తగ్గాయని చెప్పారు. “ఆహారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. కాబట్టి, తరచూ వాటి ఆహారం కోసం మా సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి” అని ఆ జూపార్క్ మేనేజర్ ఎస్సామెల్డిన్ హజ్జర్ చెప్పారు. సింహాల ఇలా దయనీయ స్థితిలో రావడానికి జూపార్క్ ను సరిగా నిర్వహించలేకపోవడం కూడా ఓ కారణమని ఆయన అన్నారు.

Today was a positive day at Qurashi Park. We had good meetings with the park administration and the wildlife police. It…

Posted by Osman Salih on Sunday, January 19, 2020