కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు

హైదరాబాద్, వెలుగు: కొత్త బస్సులు కొనుగోలు చేసే పరిస్థితిలో సంస్థ లేదని, ప్రయాణికులకు సరిపడా బస్సులు నడిపేందుకు నిబంధనల ప్రకారమే అద్దె బస్సులను తీసుకున్నామని హైకోర్టుకు ఆర్టీసీ మేనేజ్​మెంట్​​నివేదించింది. 1,035 అద్దె బస్సుల కోసం జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను విచారించిన హైకోర్టు కౌంటర్​ దాఖలు చేయాలని ఆర్టీసీని ఇటీవల ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ ఇన్‌చార్జ్​ఎండీ సునీల్‌ శర్మ శుక్రవారం కౌంటర్‌ పిటిషన్‌ వేశారు. ‘‘ఆర్టీసీకి 8,347 సొంత, 2,013 అద్దె బస్సులు ఉన్నాయి. నిర్వహణ, మరమ్మతు లకుపోను 9,889 బస్సులే రోజూ నడుపుతాం. ఆరేళ్ల క్రితం నాటి తీర్మానం మేరకు అద్దె బస్సులు 20 నుంచి 25 శాతం వరకూ తీసుకునే వీలుంది. అత్యవసర పరిస్థితుల్లో అద్దె బస్సులు తీసుకునేందుకు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 307 వీలు కల్పిస్తోంది. 1,035 అద్దె బస్సులకు అక్టోబర్ 10న టెండర్‌ పిలిచి 287 మంది బస్సు ఓనర్లకు కేటాయింపులు కూడా చేశాం. టెండర్ల ఆమోదం కూడా అయిపోయి నందున పిల్‌ను డిస్మిస్‌ చేయాలి”అని కౌంటర్‌లో కోరారు.

Latest Updates