స్పీడ్​ తగ్గించమన్నా వినలే.. పైలట్​ పట్టించుకోలే

  • మూడుసార్లు వార్నింగ్​ ఇచ్చాం
  • అంతా బాగుంది.. మేనేజ్​ చేస్తానన్నడు
  • పాక్​ విమాన ప్రమాదంపై సీఏఏ రిపోర్టు

కరాచీ: ల్యాండింగ్​ టైమ్​లో విమానం ఎత్తులో ఉండడం, స్పీడ్​ కూడా ఎక్కువగా ఉండడం వల్లే పాకిస్తాన్​ ఫ్లైట్​ కూలిపోయిందని ప్రమాదంపై ఏర్పాటైన ఎంక్వైరీ కమిటీ ప్రాథమికంగా తేల్చింది. దీనిపై ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్(ఏటీసీ) వార్నింగ్​ ఇచ్చినా పైలట్​ వినిపించుకోలేదని సివిల్​ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) రిపోర్టు వెల్లడించింది. ఈ నెల 22న పాకిస్తాన్​ లాహోర్​ నుంచి కరాచీ వెళుతున్న పీకే–8303 విమానం జనముండే కాలనీలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 97 మంది చనిపోయారు. ప్రమాదానికి కారణం ల్యాండింగ్​ గేర్​ మొరాయించడమేనని ముందు అనుకున్నా .. ఏటీసీ డైరెక్షన్లను పైలట్​పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సాధారణంగా ల్యాండింగ్​ టైమ్​లో విమానం రన్​ వే ను సమీపిస్తున్న కొద్దీ ఎత్తును, వేగాన్ని పైలట్​ నెమ్మదిగా తగ్గిస్తారు. విమానం రన్​వేకు ఎంత దూరం ఉందనే దానిని బట్టి అది ఎగరాల్సిన హైట్​ను, స్పీడ్​ను ఏటీసీ సూచిస్తుంది. దీనికోసం నిర్దేశిత ప్రమాణాలను పాటించాలి. పీకే 8303 విమానం పైలట్​ మాత్రం ఈ వార్నింగ్​లను లెక్కచేయలేదని ప్రాథమిక రిపోర్టులో వెల్లడైంది.

రన్​వేను తాకడంతో ట్యాంకర్​కు పగుళ్లు..

ఎయిర్​ పోర్టు మరో 15 నాటికల్​ మైల్స్ ఉందనగా ఫ్లైట్​ 7 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉండగా.. పీకే 8303 మాత్రం 10 వేల అడుగుల హైట్​లో ప్రయాణించిందని ఏటీసీ అధికారులు చెప్పారు. దీనిపై పైలట్​ వార్నింగ్​ ఇచ్చామన్నారు. ఈ విషయంలో తాను సంతృప్తిగా ఉన్నానని, పరిస్థితిని తాను హ్యాండిల్​ చేస్తానని చెప్పారన్నారు. తర్వాత 10 నాటికల్​ మైల్స్ దగ్గర్లోకి వచ్చాక 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సిన విమానం 7 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని అన్నారు. నిర్ణయించిన స్పీడ్​ కన్నా చాలా ఎక్కువ స్పీడ్​లో రన్​ వేను అప్రోచ్​ అయ్యిందని అధికారులు చెప్పారు. అ వేగంతో ఫ్లయిట్​ కింది భాగం రన్​వేను తాకడంతో ఆయిల్​ ట్యాంకర్​కు పగుళ్లు ఏర్పడి, ఆయిల్​ లీక్​ అయిందన్నారు. ల్యాండింగ్​ అటెంప్ట్​ ఫెయిల్​ కావడంతో పైలట్​ విమానాన్ని మళ్లీ పైకి తీసుకెళ్లి, రెండోసారి ల్యాండ్​ చేసేందుకు ట్రై చేశాడని చెప్పారు. ల్యాండింగ్​ గేర్ ట్రబుల్​ ఇవ్వడంతోనే మళ్లీ గాల్లోకి లేచినట్లు చెప్పిన పైలట్.. రెండో అటెంప్ట్​లోనూ ఫ్లైట్​ను ల్యాండ్​ చేయలేకపోయాడు. ఆ తర్వాత మరోసారి ల్యాండింగ్​కు ట్రై చేయగా.. అప్పటికే ఆయిల్​ ట్యాంక్​ లీక్​ కావడం, కిందిభాగం దెబ్బతినడంతో ఫ్లయిట్​ కూలిపోయిందని సివిల్ ఏవియేషన్ ​అథారిటీ రిపోర్టు వెల్లడించింది. లాహోర్​ నుంచి కరాచీకి ట్రావెల్​ టైమ్​ గంటన్నర పడుతుంది. అయితే ఫ్లయిట్​లో రెండున్నర గంటల పాటు ప్రయాణించేందుకు అవసరమైన ఫ్యూయెల్​ ఉందని పేర్కొంది. విచారణ కమిటీ మూడు నెలల్లో పూర్తి రిపోర్టు ఇస్తుందని అధికారులు చెప్పారు.

Karachi

Latest Updates