చెట్టెక్కిన విమానం..

విమానం ఓ చెట్టుపై ఇరుక్కుంది. చెట్ల కొమ్మల మధ్యన ఫ్లైట్ ఇరుక్కోవడంతో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం ఏంటీ..చెట్ల కొమ్మలు కాపాడంటం ఏంటని అనుకుంటున్నారు కదూ..! అయితే ఆ విమానం చిన్నదిలెండీ. ఓ బడా బాబు స్పెషల్ గా కొనుక్కున్నాడు. అప్పుడప్పుడు ఆకాశంలో ఎంజాయ్ చేస్తూ తిరుగుతాడు. ఇటీవల అమెరికాలోని ఇడాహోలో…  తన చిన్న విమానాన్ని ఇడాహోగ్రౌండ్ లో  ల్యాండ్ చేద్దామని ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో… విమానం స్లోగా వెళ్లి… 60 అడుగుల ఎత్తున ఓ చెట్టుపై కూలింది. ఆ టైంలో అంతా చీకటిగా ఉంది.

ఆ సింగిల్ ఇంజిన్ విమానానికి ఏం జరిగిందో కొన్ని క్షణాలపాటూ పైలట్ కి అర్థం కాలేదు. చెట్టుపై కూలిన విమానం అక్కడి నుంచీ కింద పడేదే. లక్కీగా దాని ఒక రెక్క… చెట్టులో ఇరుక్కుంది. దాంతో అది కూలిపోకుండా వేలాడసాగింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికొచ్చి… పైలట్‌ ను సురక్షితంగా కాపాడారు. ఇప్పుడా వీడియో చూస్తున్నవారంతా చెట్టు ఎక్కి… అసలా విమానం అక్కడ ఎలా ఇరుక్కుందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు.

విమానంలో ఎక్కువ భాగం ఒక చెట్టుపైనే ఉందన్న పైలట్… మరో చెట్టును కూడా అది టచ్ చేసి ఉందని తెలిపాడు. ఇలాంటి సీన్ తాము ఎప్పుడూ చూడలేదన్న ఫైర్ సిబ్బంది… పైలట్‌ను రక్షించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక స్థానికులైతే… ఆ విమానాన్ని ఫొటోలు తీసుకుంటూ, షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది.

Latest Updates