కాంగ్రెస్ లోకి పైలట్ రిటర్న్‌‌‌‌?

 రాహుల్, ప్రియాంక గాంధీతో మీటింగ్

సమస్యలన్నీ పరిష్కరిస్తానని రాహుల్ గాంధీ హామీ

పార్టీతోనే ఉండేందుకు పైలట్ఓకే చెప్పారన్న కాంగ్రెస్

న్యూఢిల్లీ: రాజస్థాన్ లో పొలిటికల్ క్రైసిస్ కు దాదాపు తెరపడింది. కొన్ని కండిషన్లతో పార్టీలోకి తిరిగి వచ్చేందుకు రెబెల్ నేత సచిన్ పైలట్ ఓకే చెప్పినట్లు సోమవారం కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. అగ్ర నేతలు రాహుల్ గాం ధీ, ప్రియాంక గాంధీ, వాద్రాలతో సచిన్ పైలట్ సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం, స్టేట్ కాం గ్రెస్ చీఫ్ పదవుల్లోకి మళ్లీ తీసుకోవాలని ఆయన డిమాం డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 14న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అశోక్ గెహ్లాట్ విశ్వాస పరీక్ష ఎదుర్కొంటే.. మద్దతు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. రెండు గంటలపాటు మీటిం గ్ జరిగిం దని, సచిన్ పైలట్ గ్రూప్ లేవనెత్తిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ గాం ధీ హామీ ఇచ్చినట్లు కాం గ్రెస్​ వర్గాలు చెప్పాయి. పైలట్ డిమాం డ్లను పరిష్కరించేందుకు ముగ్గురు సీనియర్ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు కాం గ్రెస్​ సీనియర్ నేత వేణుగోపాల్ చెప్పారు.

గెహ్లాట్పై అసంతృప్తితో..

దాదాపు నెల రోజులుగా సీఎం అశోక్ గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్, 18 మంది ఎమ్మెల్యే లు తిరుగుబాటు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం, స్టేట్ కాం గ్రెస్ చీఫ్ పదవుల నుంచి సచిన్ పైలట్ ను కాం గ్రెస్ పార్టీ తొలగించింది. బీజేపీతో కలిసి తమ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సచిన్ పైలట్  యత్నిస్తున్నారంటూ అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. దీన్ని సచిన్ పైలట్ ఖండిం చారు. బీజేపీలో చేరే ప్లాన్స్ లేవని స్పష్టం చేశారు. గతంలో సచిన్ పైలట్ ను బుజ్జగించేం దుకు ప్రియాంక గాంధీ ప్రయత్నిం చినా… ఫలితం రాలేదు.

పైలట్ను తీసుకోవద్దంటు న్న ఎమ్మెల్యే లు..

మరోవైపు జైసల్మేర్ లోని హోటల్ లో సీఎం అశోక్ గెహ్లాట్ సీఎల్పీ మీటింగ్ నిర్వహించారు. సచిన్ పైలట్ తోపాటు రెబెల్ ఎమ్మెల్యే లను మళ్లీ పార్టీ లోకి తీసుకోవద్దని ఎమ్మెల్యేలు కోరారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యం లో యూనిటీగా ఉండాలని గెహ్లాట్ ఎమ్మెల్యే లను కోరారు. విశ్వాస పరీక్షలో గెలుస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Latest Updates