సిటీలో పింక్ మార్కెట్

సిటీలో పింక్ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను.. మహిళలే విక్రయించేందుకు ప్రత్యేకంగా పింక్  మార్కెట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మార్కెట్ నగరంలోనే మొదటిసారిగా చందానగర్ లో ప్రారంభించారు.

సిటీలో పింక్ మార్కెట్లను అందుబాటులోకి తెస్తోంది ప్రభుత్వం. స్వయం ఉపాధి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పింక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. వీటిని మహిళా గ్రూపు సంఘాలే నిర్వహిస్తున్నాయి. GHMC, హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ CSR ఫండ్స్ తో మొదటి పింక్ మార్కెట్ ఏర్పాటైంది.

చందానగర్  బస్టాప్  దగ్గర పింక్ మార్కెట్ ను ఈనెల 6న ప్రారంభించారు. స్వయం ఉపాధి గ్రూపులకు చేయూతనిచ్చేందుకు ఈ మార్కెట్ ను ఏర్పాటు చేశామని బల్దియా అధికారులు చెబుతున్నారు. మొదటి పింక్ మార్కెట్ చందానగర్ లో ఏర్పాటు చేశామనీ.. ఈ మార్ట్ స్థానిక మహిళలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

పింక్  మార్కెట్లో మహిళలు తయారు చేసిన జూట్  బ్యాగ్స్, ఇస్తర్లు, మిల్లెట్స్, ఫుడ్ ఐటమ్స్, సబ్బులు, షాంపూలు, రీసైక్లింగ్  టైల్స్, బోర్డ్స్, పాత జీన్స్ తో చేసిన బ్యాగ్స్ అమ్ముతున్నారు. ఇందులో ప్రత్యేకంగా టాయిలెట్లతో పాటు బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు.

Latest Updates