యూపీఏ కన్నా పది రెట్లు ఎక్కువ నిధులిచ్చినం

యూపీఏ హయాంతో పోలిస్తే తాము తెలంగాణకు పది రెట్లు ఎక్కువగా రైల్వే నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని, అయినా రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పీయూష్​ గోయల్​ మంగళవారం సికింద్రాబాద్‌‌రైల్వే స్టేషన్‌‌లో చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగుంట్ల-నంద్యాల రూట్​ విద్యుదీకరణ, గుంతకల్‑‑‑—-కల్లూరు మార్గంలో డబుల్ లైన్ విద్యుదీకరణ, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 427 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సేవలను రిమోట్‌‌కంట్రోల్‌‌ద్వారా ప్రారంభించారు. తర్వాత మాట్లాడారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తోందని అన్నారు. అంతకు ముందు తలసాని చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. ‘‘దక్షిణ భారతాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసిందని తలసాని అంటున్నారు. కానీ అది కాంగ్రెస్ హయాంలో జరిగింది. ప్రధాని మోడీకి దేశమంతా ఒక్కటే. 2014–15లో యూపీఏ సర్కారు రూ.258 కోట్లు ఇస్తే.. మేం పదింతలు ఎక్కువ నిధులు ఇచ్చాం. నా దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయి. కేంద్రం ఏమేం ఇచ్చిందో అన్ని లెక్కలు చేతిలో పట్టుకునే వచ్చాను. తలసాని వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని పీయూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వానికి దేశమంతా ఒక్కటేనని, నిధుల కేటాయింపులో ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని, అవన్నీ అవాస్తవ ఆరోపణలని స్పష్టం చేశారు.

ఎన్నో పనులు మంజూరు చేసినం

యూఏపీ హయాంలో తెలంగాణ రైల్వేకు రూ.258 కోట్లు మాత్రమే ఇస్తే.. తమ సర్కారు ఇటీవలి బడ్జెట్​లో అంతకు పదింతలు ఎక్కువగా కేటాయించిందని పీయూష్​ గోయల్​ చెప్పారు. రాష్ట్రంలో రైల్వే పనులకు రూ.2,602 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ఐదేండ్లలో 158 కిలోమీటర్ల కొత్త లైన్లు, 48 కిలోమీటర్ల డబ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రిప్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పనులు, 303 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పనులు చేశామన్నారు. రాష్ట్రానికి రూ. 10 వేల కోట్ల వ్యయంతో చేపట్టే 12 కొత్త ప్రాజెక్టులు మంజూరు చేశామని, వాటి పనులు నడుస్తున్నాయని వివరించారు. తెలంగాణ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 22 కొత్త రైళ్లు తీసుకొచ్చామని, 42 రైళ్లను పొడిగించామని తెలిపారు. లింగంపల్లి టెర్మినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎంఎంటీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్రం రూ. 500 కోట్లు ఇచ్చిందని, రాష్ట్రం మాత్రం తన వాటా ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్రం డబ్బులివ్వడం లేదనే కారణంతో తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేదన్నారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి సోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రకాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీలు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సోయం బాపురావు, సీఎం రమేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రఘురామకృష్ణంరాజు, రంగయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తదితరులు
పాల్గొన్నారు.

Latest Updates