టిక్ టాక్ వీడియో షేర్ చేసి వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి

టిక్ టాక్ లో ఎలాంటి వీడియోలో వస్తాయో అందరికీ తెలుసు.ఒక్కోసారి ప్రమాదకర స్టంట్స్ వస్తుంటాయి. ప్రస్తుతం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ షేర్ చేసిన టిక్ టాక్  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టిక్ టాక్ వీడియోలో రన్నింగ్ ట్రైన్ లో ఒక వ్యక్తి డోర్ నుంచి వేలాడుతూ  ఉంటాడు. కిందకు దిగేందుకు ప్రయత్నిస్తున్న అతను  ట్రైన్ నుంచి కిందపడిపోయాడు. ట్రైన్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా అరుస్తున్నారు. అదృష్టవ శాత్తు అతను  ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనను ట్రైన్ లో ఉన్న మరొక వ్యక్తి వీడియో తీసి టిక్ టాక్ లో పోస్ట్ చేశారు. టిక్ టాక్ లో వచ్చిన ఈ వీడియోను పీయూష్ గోయల్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి హెచ్చరించాడు. రైల్వేశాఖ రూల్స్ ను పాటించాలని సూచించారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయకూడదని హెచ్చరించారు. కదిలే రైలులో స్టంట్స్ చేయడం ధైర్యం కాదని.. అది మూర్ఖత్వమని ట్వీట్ చేశారు. 

Latest Updates