రైల్వే శాఖ మంత్రి ట్వీట్: మేడ్చల్ స్టేషన్ మస్తుగుంది

రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ గురువారం మేడ్చల్​ రైల్వే స్టేషన్​ ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. స్వచ్ఛభారత్ లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడమే కాకుండా రైల్వే స్టేషన్ లోని ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మెట్లపై పులి, సింహంతోపాటు నెమలి బొమ్మలను ఏర్పాటు చేయడం మేడ్చల్ రైల్వేస్టేషన్ కే అందాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని స్టేషన్ గురించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి 4 ఫోటోలతో పోస్ట్ చేయడం సంతోషంగా ఉందని పలువురు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.             – మేడ్చల్, వెలుగు

Latest Updates