పంజాబ్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కు అశ్విన్

న్యూఢిల్లీ: సీనియర్‌‌ ఆఫ్‌‌ స్పిన్నర్‌‌ రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌ వచ్చే ఐపీఎల్‌‌ సీజన్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. ఇందుకు సంబంధించిన అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయి. గత రెండు సీజన్‌‌లలో కింగ్స్‌‌ లెవన్‌‌ పంజాబ్‌‌ను నడిపించిన అశ్విన్‌‌ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాడు. దీంతో రవిచంద్రన్​ అశ్విన్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్​కు బదలాయిస్తున్న పంజాబ్‌‌, అందుకు బదులుగా ఇద్దరు ఢిల్లీ ఆటగాళ్లను తీసుకుంటుంది. అయితే ఆ ఇద్దరు ఎవరనే దానిపై సమాచారం లేదు.

 

Latest Updates