రైతుల ట్రాక్టర్ ర్యాలీలో కాల్పులకు ప్లాన్.. నిందితుడిని పట్టుకున్న రైతులు

ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. జనవరి 26న రైతులు చేయదలచిన ట్రాక్టర్ పరేడ్‌లో కాల్పులు జరిపి గందరగోళం సృష్టించేందుకు చేసిన ప్లాన్‌ను రైతులు నిర్వీర్యం చేశారు. కాల్పులు జరపడానికి వచ్చిన వ్యక్తిని పట్టుకుని రైతు సంఘాల నాయకులు పోలీసులకు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని రైతులు పట్టుకొని విచారించగా.. ఈ విషయం బయటపడింది. వెంటనే ఆ వ్యక్తిని హర్యానా పోలీసులకు అప్పగించారు.

అతన్ని రైతులు, పోలీసులు విచారించగా నమ్మలేని విషయాలు తెలిశాయి. ‘జనవరి 26న రైతులు చేసే ట్రాక్టర్ ర్యాలీలో అల్లర్లు సృష్టించాలని మాకు ఆర్డర్లు ఉన్నాయి. హర్యానాలోని రాయ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్ఓగా పనిచేసే ప్రదీప్ సింగ్ మాకు గన్ ఫైరింగ్‌లో శిక్షణ ఇచ్చాడు. మేం మొత్తం పది మంది ఉన్నాం. మా టీంలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ర్యాలీలో పోలీసులు రైతులను అడ్డుకునే క్రమంలో ఈ ఫైరింగ్ చేయాలని మాకు ఆదేశాలిచ్చారు. ఎవరిని కాల్చాలో కూడా ఫోటోలు పంపారు. దాదాపు 90 శాతం పని పూర్తి చేశాం. అయితే ఈ విషయాన్ని లీక్ చేస్తే ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తున్నారు. హర్యానా సీఎం ఖట్టర్ ర్యాలీలో కూడా లాఠీ ఛార్జీ చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి’ అని ఆ వ్యక్తి తెలిపాడు. పట్టుబడిన వ్యక్తిని సోనిపట్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

For More News..

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

బిల్డింగులు కట్టుకోండి.. ఎవడు ఆపుతడో చూస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఫోన్ ఉంటేనే రేషన్.. బయోమెట్రిక్ బదులు ఓటీపీ సిస్టమ్

Latest Updates