కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఫ్లైట్‌లో 100 మంది..

కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆల్‌మటీ విమానాశ్రయానికి సమీపంలో ఈ విమానం కూలింది. విమానంలో 95 మంది ప్రయాణికులు మరియు 5 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఎయిర్ పోర్టు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

స్థానిక విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్‌మటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బెక్ ఎయిర్ విమానం టేకాఫ్ కొద్ది క్షణాల్లోనే కంట్రోల్ తప్పి రెండు అంతస్థుల భవనంపై కూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటికైతే 14 మంది మృతి చెందినట్లు స్థానిక విమానయాన అధికారులు తెలిపారు.

ఈ విమానం ఆల్‌మటీ నుంచి రాజధాని నూర్-సుల్తాన్‌కు వెళుతున్నది. ఉదయం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం ఒక బిల్డింగ్‌పై కూలినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. సంఘటనా స్థలంలో రక్షణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

For More News..

నిర్బయ తరహాలో.. బస్సులో మైనర్ బాలికపై అత్యాచారం

హీరోయిన్ రవీనా టాండన్‌పై కేసు నమోదు

పది ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఒక మిల్క్ ప్యాకెట్ ఫ్రీ

Latest Updates