అమెరికాలో విమాన ప్రమాదం: 9మంది మృతి

అమెరికాలోని సౌత్ డకోటా లో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పిల్లలతో సహా ఒక పైలెట్ ఉన్నట్లు చెప్పారు అధికారులు. ముగ్గురికి తీవ్రంగా గాయాలవగా హాస్పిటల్ కు చేర్చారు. వింటర్ స్ట్రోమ్ వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు అమెరికా పోలీసులు. పిలేటస్ పీసీ-12 అనే సింగిల్ ఇంజన్ టర్బ ప్రోప్ ప్లేన్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. చామ్ బెర్లేన్ ఎయిర్ పోర్ట్ నుంచి 12 మందితో గాలిలోకి ఎగిరింది. టేక్ ఆఫ్ అయిన కిలో మీటరు దూరంలోనే ప్రమాదం జరిగింది.

Latest Updates