కర్నాటకలో ప్లాస్మా థెరపీ షురూ

ఐసీయూ, వెంటిలేట ర్ పై ఉన్న కరోనా పెషెంట్లకు ట్రీట్ మెంట్

బెంగళూరు: కర్నాటకలో కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ట్రయల్ మొదలైంది. ఐసీయూ, వెంటిలేటర్ పై ఉన్న వారికి ఈ విధానంలో చికిత్స అందిస్తారు. ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్ మొదలైనందుకు సంతోషంగా ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కె. సుధాకర్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ లో హెల్త్ మినిస్టర్ శ్రీరాములుతో కలిసి ఈ థెరపీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్లాస్మా థెరపీ కోసం దాతలు కూడా ముందుకొచ్చినట్లు తెలిపారు. కరోనాపై పోరాటంలో ప్లాస్మా థెరపీ టార్చ్ బేరర్ గా నిలుస్తుందని హెల్త్ మినిస్టర్ శ్రీరాములు అన్నారు. ప్లాస్మా థెరపీ మొదటి ఫేజ్ క్లినికల్ ట్రయల్ కు కర్నాటక సర్కారు ముందడుగు వేసిందన్నారు.

Latest Updates