మంచు ఖండంలో ప్లాస్టిక్ వానలు

  • ఆర్కిటిక్ కూ వ్యాపించిన కాలుష్యం       
  • జర్మనీ, అమెరికా సైంటిస్టుల రీసెర్చ్ లో వెల్లడి

ఇప్పటిదాక వడగండ్ల వానలు చూసినం. వాన చినుకులతో పాటు కప్పలు, చేపలుపడటం గురించి విన్నాం. యాసిడ్ వానల గురించీచదివినాం. కానీ.. మనకు తెలియకుం డానే ప్లాస్ టిక్వానల్లో తడుస్తున్నా మని తెలుసా? మనకు తెలియకుండానే రోజూ ప్లాస్టిక్ గాలి పీల్చుకుంటున్నామని గమనిం చారా? ప్లాస్టిక్ వానలేంటి? గాలేంటి?అంటారా? ప్రపంచంలోనే మోస్ట్ క్లీనెస్ట్ ప్లేస్ గా చెప్పుకొనే ఆర్కిటిక్ మంచు ఖండంలోనూ ప్లాస్టిక్ వానలు పడుతున్నాయని సైంటిస్టులు తేల్చారు!

రంగురంగుల పార్టికల్స్

ఆర్కిటిక్ లో మనుషుల సంచారం చాలా తక్కువ.కాలుష్యానికి కారణమయ్యే పనులూ తక్కువే.అయినా అక్కడ లీటరు గాలిలో 10 వేలకు పైగాప్లాస్ టిక్ కణాలున్నట్లు జర్మనీలోని ఆల్ఫ్రెడ్ వీజ్ నర్ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు కనుగొన్నా రు. నార్వే వద్ద ఉన్న స్వాల్బర్డ్ ఐలాండ్స్, హెల్గెలాం డ్, బవేరియా,బ్రెమెన్, స్విస్ ఆల్ప్స్, అర్కిటిక్ ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. కంటికి కనిపించని సైజుల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొన్నా రు. అవి చిన్నగా ఉండటంతో ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం కష్టమవుతోందని చెబుతున్నారు. రబ్బర్ టైర్లు, వార్నిష్ లు, పెయింట్లు ,సింథటిక్ ఫైబర్ల వంటి వాటి నుంచి ఇవి వాతావరణం లోకి చేరి ఉంటాయని భావిస్తున్నా రు. యూఎస్ జియోలజికల్ సర్వే కూడా ‘ఇట్స్ రెయినిం గ్ ప్లాస్టిక్’పేరుతో సర్వే నిర్వహించింది. మామూలుగా చూస్తేగాలిలో ప్లాస్టిక్ కణాలు కనిపిం చలేదని, బైనాక్యులార్ మైక్రోస్కోప్ ను అమర్చిన డిజిటల్ కెమెరాతో చూస్తే రంగురంగుల్లో మెరుస్తూ కనిపిస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించిం ది.

ప్లాస్టిక్ గాలి ఆర్కిటిక్ కు ఎలా?

గాల్లో కలిసే ప్లాస్టిక్ అణువులు గాలితో పాటు ప్ర-యాణిస్తూ వచ్చి ఆర్కిటిక్ మంచుతో కలిసి వానల్లాపడుతున్నా యని సైంటిస్టులు చెబుతున్నా రు. ఉదాహరణకు సహారా ఎడారి దుమ్ము 3,500 కి.మీ.దూరం గాలిలో ప్రయాణిస్తుం దని.. అలాగే ప్లాస్టిక్ కూడా దూర ప్రాంతాలకు గాలి ద్వారా వ్యాపించవచ్చని అంటున్నా రు. ఫ్రాన్స్ లో ని పారిస్, చైనాలో నిడాంగ్వా న్, ఇరాన్ లో ని టెహ్రాన్ నగరాల్లో ప్లాస్టిక్ గాలులు ఎక్కువగా ఉంటున్నా యని ఇటీవలి పరి-శోధనల్లో వెల్లడైంది కూడా. అయితే, ఆర్కిటిక్ లోవార్ని ష్ కణాలు కనిపిం చడం ఆశ్చర్యం గా ఉందం-టున్నా రు. ఇవి నౌకలు మంచును రాసుకుంటూపోయినప్పుడు రాలిపడి ఉంటాయని చెబుతున్నారు. ఇక బట్టల్లోని ఫైబర్ అణువులు కనిపించడం ఊహకందడం లేదంటున్నా రు.

మైక్రో ప్లాస్టిక్ అంటే..?

5 మిల్లీమీ టర్ల కంటే తక్కువ సైజుం డే ప్లాస్టిక్ కణాలను మైక్రోప్లాస్టిక్ గా పిలుస్తారు. ఆర్కిటిక్ ప్లా-స్టిక్ వానల్లో గుర్తించిన పార్టికల్స్ లో కార్లు, లారీలటైర్లకు వాడే రబ్బర్ కణాలే ఎక్కువున్నా యి. వీటిలో98 శాతం కణాలు100 మైక్రోమీటర్ల కంటే చిన్నగా ఉన్నా యి. ఆర్కిటిక్ లో 14,400 కణాలు ఉండగా,బవేరియాలోని ఓ గ్రామం వద్ద ఏకంగా లీటరుకు1,54,000 కణాలు ఉన్నట్లు తేలిం ది. వాతావ-రణంలోని ఈ ప్లాస్ టిక్ కణాలు మంచుకు త్వరగా అతుక్కుంటుండటంతో దానితోపాటు వానలా పడుతున్నా యని సైంటిస్టులు అంటున్నా రు.

వారానికి 5 గ్రాములు మింగుతున్నామా?

సముద్రం, నదులు, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చే చే పలు, కూరగాయల వంటిఆహారం, తాగునీటి ద్వా రా మాత్రమే కాకుండా రోజూ పీల్చే గాలి ద్వా రా కూడా ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతోందని సైంటిస్టు లు చెబుతున్నారు. మనం ఒక వారానికి సుమారు ఒక క్రెడిట్ కార్డును తయారు చేసేందుకు సరిపోయేంత అంటే.. 5 గ్రాముల ప్లా స్టిక్ కణాలను పీల్చుకుంటున్నామని ఇటీవలి ఓ రీసెర్చ్ లో వెల్లడైంది కూడా. కానీ మనిషి శరీరంలోకి ఎంత ప్లాస్టిక్ చేరితే ప్రమాదం? దాని విషప్రభావాలు ఎలా ఉంటాయి? అన్న విషయంలో ఇప్పటిదాకా సరైన పరిశోధనలు జరగలేదని చెబుతున్నారు.ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ ను పీల్చి తే కలిగే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇంకా సరిగ్గా తెలియవని అంటున్నారు. అయితే, ప్లా స్టిక్ మైక్రో పార్టికల్స్ పీలిస్తే ఊపిరితిత్తుల వాపు,ఇరిటేషన్, అలెర్జీలు కలుగుతాయని కొన్ని స్టడీస్ లో తేలింది. లంగ్ కేన్సర్ పేషంట్లలో కొంచెం పెద్ద సైజు ప్లాస్టిక్ పార్టికల్స్ కూడా బయటపడ్డాయి.

ఆసియా, చైనాయే కారణం

ఇటీవలి కాలంలో అమెరికా తీరాలను ప్లాస్టిక్ ముంచెత్తుతోంది. ఆసియా దేశాలు, చైనా, ఇతర దేశాల నుంచి గాలి, సముద్రం ద్వారా ప్లా స్టిక్ చెత్త అమెరికాకు వ్యాపిస్తున్నా యి. ఇతర దేశాలు ప్లా స్టిక్ విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదు. ఇది ఎంతో కాలం సాగదు. – అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Latest Updates