హస్పిటల్ లో చేరిన సింగర్ జానకి

మైసూరు : కాలి నొప్పితో బాధపడుతున్న ప్రముఖ సింగర్ ఎస్ జానకి(81) హస్పిటల్ చేరారు. శనివారం ఆమెను మైసూరులోని ఓ ప్రయివేటు హస్పిటల్ లో అడ్మిట్ చేశామని తెలిపారు జానకి బంధువులు. ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. ఇటీవల బంధువుల ఇంట్లో ఉండగా జానకి కాలుజారి పడిపోవడంతో ఆమె  కుడి కాలికి  ఫ్రాక్చర్‌ అయిందని తెలిపారు.

నొప్పి తీవ్రంగా ఉండటంతో హస్పిటల్ లో అడ్మిట్ చేశామన్నారు. గాన కోకికలగా బిరుదు సంపాధించుకున్న జానకి అన్ని భాషల్లోనూ పాటలు పాడిన విషయం తెలిసిందే. ఆమె కాలినొప్పి త్వరగా తగ్గాలని కోరుకుంటున్నారు జానకీ ఫ్యాన్.

Latest Updates