సీఎస్ కేకు ఆడితే ప్లేయర్స్ కెరీర్ మళ్లీ మొదలవుతుంది

విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీపై విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ లీడర్ షిప్ స్కిల్స్ గురించి బ్రావో పలు విషయాలు చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) క్యాంపులో ఉన్న ప్రతి ప్లేయర్ ను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తాడని ధోనీని కొనియాడాడు. 2011 నుంచి సీఎస్ కే టీమ్ లో ధోని, బ్రావో కలసి ఆడుతున్నారు. ఎంతోమంది ఇంటర్నేషనల్ కెప్టెన్స్ ను చూసినప్పటికీ తన దృష్టిలో ధోని అత్యుత్తమం అని బ్రేవో పేర్కొన్నాడు.

‘ఇన్ని సంవత్సరాల్లో సీఎస్ కే డ్రెస్సింగ్ రూమ్ లో చాలా మంది మంచి కెప్టెన్లు ఉండొచ్చు. ఫా డుప్లెసిస్, బ్రెండన్ మెక్ కల్లమ్, మైక్ హస్సీతోపాటు నేను కూడా వారిలో ఒకడిని. వీరు కొన్ని దేశాల్లో కెప్టెన్స్ గా ఉన్నారు. కానీ ధోని మాత్రం విభిన్నం. ధోని ప్లేయర్స్ తో.. మీరు మంచి ప్లేయర్ కాబట్టే ఇక్కడ ఉన్నారు, అందుకే కొత్తగా మీరు ఎవరికీ ఏదీ నిరూపించే అవసరం లేదు, మీరేం చేయగలరనేది ఫ్రాంచైజీకి తెలుసు. మీరు మీలాగే ఉండండి అని చెప్తాడు. ఒక ప్లేయర్ సీఎస్ కేకు వచ్చినప్పుడు అతడి కెరీర్ మళ్లీ ప్రారంభమవుతుంది. కొన్నేళ్ల క్రితం షేన్ వాట్సన్ ఎలా ఉండే వాడో చూడండి. అలాగే ముంబైని వీడాక అంబటి రాయుడు ఎలా ఆడుతున్నాడో గమనించండి. చెన్నై జట్టులో చేరాక ప్రతి ఒక్కరి కెరీర్ గ్రాఫ్ పైపైకి పోతూనే ఉంటుంది. ధోని ఎవరి మీదా ఒత్తిడి తీసుకురాడు. అతడో సూపర్ స్టార్ అనేలా బిహేవ్ చేయడు. ధోని రూం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవ్వరైనా ఎప్పుడైనా వెళ్లి కలవొచ్చు. ప్లేయర్స్ ను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తాడు’ అని బ్రావో వివరించాడు.

Latest Updates