తన స్పీచ్ తో శభాష్ అనిపించుకున్న త్రిష

త్రిష ఓ పక్క నటిగా దూసుకుపోతోంది. మరోపక్క యునిసెఫ్‌ ప్రతినిధిగా సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. రీసెంట్‌ గా ఓ సభలో ఆమె చిన్నారుల పట్ల జరిగిన హింస గురించి అద్భుతంగా మాట్లాడి శభాష్ అనిపించుకుంది. స్టెల్లా మేరీస్ కాలేజ్‌ ,తోళమై సంస్థలతో కలిసి యునిసెఫ్ ఓ సభనునిర్వహించింది. మూడువేల మంది యునిసెఫ్‌ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన త్రిష… చిన్నారుల పట్ల జరుగుతున్నదారుణాల గురించి ఆవేదనతో మాట్లాడింది.‘బాలికలు, మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. వీటిలో తొంభై అయిదు శాతం
అత్యాచారాలే. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందోనన్న స్పృహ ఎవరికీ ఉండక పోవడం వల్లే ఇలాంటివి ఎక్కువవుతున్నాయి. అందుకే చిన్నారుల్లోను,యువతలోను వీటి పట్ల అవగాహన కల్పించాలి’ అంది త్రిష.

అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండొద్దు,ధైర్యంగా గళం విప్పండి, నేరస్తులకు శిక్ష పడేట్టు చెయ్యండి అంటూ ధైర్యం నూరిపోసింది. అంతేకాదు.. సినిమాలు చూసి హింసను అలవర్చుకోవద్దని, సినిమా అనేది ఓ కల్పన అని,దాన్ని అనుసరిం చొద్దని చెప్పింది. ఆమె మాటలు అక్కడున్నవారందరినీ ఎంతో ఇన్‌  స్పైర్ర్ చేశాయి.ఇన్నాళ్లూ నటిగానే తెలిసిన త్రిషలో ఓ మంచి మనిషి ఉందని, ఆమెకు సమాజం పట్ల ఇంత అవగాహన ఉందని తెలిసి అందరూ ప్రశంసిస్తున్నారు.

 

Latest Updates