బెంగాల్‌కు వెయ్యి కోట్లు సాయం

  • ప్రకటించిన ప్రధాని
  • అంపన్‌ తుపాను ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే

కోల్‌కతా: అంపన్‌ తుపాను కారణంగా అతలాకుతలమైన పశ్చిబెంగాల్‌ను ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తక్షణ సాయం కింద అడ్వాన్స్‌ ఇన్సూరెన్స్‌ రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంపన్‌ తుపాను ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీతో కలిసి మోడీ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. దాదాపు మూడు నెలల తర్వాత మోడీ మొదటి పర్యటన ఇదే. నార్త్‌ 24 పరగనాస్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం ఒక స్కూల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ మాట్లాడారు. “ ఈ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమబెంగాల్‌కు అండగా ఉంటుంది. బెంగాల్‌ కోలుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం” అని మోడీ అన్నారు. బెంగాల్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం కోల్‌కతా ఎయిర్‌‌పోర్ట్‌కు చేరిన ప్రధాని మోడీకి రాష్ట్ర గవర్నర్‌‌ ధనకర్‌‌, మమతా బెనర్జీ స్వాగతం పలికారు. కాగా.. ప్రధాని మోడీ కొద్ది సేపట్లో ఒడిశా చేరుకోనున్నారు. రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియాలో చేయనున్నట్లు అధికారులు చెప్పారు. సూపర్‌‌‌‌ సైక్లోన్‌ అంపన్‌ బెంగాల్‌ను అతలాకుతం చేసింది. బెంగాల్‌, ఒడిశా, బంగ్లాదేశ్‌లో తుపాను ధాటికి 74 మంది చనిపోయారు. కోల్‌కతా సిటీలో 12 మంది, ఒడిశాలో ఇద్దరు, బంగ్లాదేశ్‌లో 10 మంది చనిపోయారు.

Latest Updates