కరోనా  విరాళాల కోసం ‘పీఎం కేర్స్ ఫండ్’ 

దేశవ్యాప్తంగా కరోనా స్వైరవిహారం చేస్తుండటంతో…దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘పీఎం కేర్స్ ఫండ్’ ఏర్పాటు చేశారు. కరోనాపై పోరుకు, సహాయక చర్యలకు ఉపయోగపడేలా విరాళాలు ఇవ్వాలనకున్న వారు దీన్ని వేదికగా చేసుకోవాలన్నారు. భారతీయులందరూ ‘పీఎం కేర్స్ ఫండ్’ కు విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చిన్నమొత్తాలు కూడా విరాళాలుగా అందించవచ్చన్నారు మోడీ.

మున్ముందు కూడా విపత్తులు సంభవించినప్పుడు, అత్యవసర సమయాల్లో ఈ ఫండ్ కొనసాగుతుందని తెలిపారు ప్రధాని మోడీ. విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని ఇనుమడింప చేయడమే కాకుండా, ప్రజలను కాపాడే పరిశోధనలకు ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా, ‘పీఎం కేర్స్ ఫండ్’ బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా మోడీ ట్విట్టర్ లో పంచుకున్నారు.

Latest Updates