రాఫెల్ లో అవినీతికి గేట్లు తెరిచిన మోడీ: రాహుల్

pm-facilitated-loot-in-rafaleన్యూఢిల్లీ: రాఫెల్ డీల్ లో ప్రధాని మోడీ అవినీతికి గేట్లు తెరిచారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న ఒక్క రోజు దీక్షలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రతి రక్షణ ఒప్పందంలోనూ అవినీతి నిరోధక క్లాజ్ ఒకటి ఉంటుందని చెప్పారు. కానీ రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోడీ ఆ క్లాజ్ ను ఎత్తేశారని ఓ జాతీయ మీడియా రిపోర్ట్ చేసిందని అన్నారు. దీన్ని బట్టే రాఫెల్ డీల్ లో అవినీతికి మోడీ గేట్లు తెరిచారని అర్థమవుతోందన్నారు.

అంతకుముందు దీక్షా శిబిరంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను అండగా ఉంటానని చెప్పారు. ఏపీకి ఇచ్చిన ఒక్క హామీని కూడా మోడీ నిలబెట్టుకోలేదని రాహుల్ అన్నారు. అసలు ఆయనేం ప్రధానమంత్రి అని ఎద్దేవా చేశారు. మోడీ ఎక్కడికి పోయినా అబద్ధాలు చెబుతుంటారని, ఆయనకు విశ్వసనీయత అనేదే లేదని అన్నారు.

 

Latest Updates