నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు

8.5 కోట్ల రైతులకు రూ. 17,100 కోట్లు

పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలోకి రూ .17 వేల కోట్లు బదిలీ చేశారు. పీఎం కిసాన్ పథకాన్ని 2018లో ప్రారంభించారు. ఆ పథకం యొక్క ఆరవ విడతలో భాగమే నేటి నగదు బదిలీ. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (పిఎం-కిసాన్) పథకం ద్వారా ప్రత్యక్ష నగదు ప్రయోజనాన్ని 9.9 కోట్లకు పైగా రైతులకు 75,000 కోట్లు అందుతుంది. ఈ పథకం యొక్క ఉద్దేశం మరియు నగదు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు.. రైతుల ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకైతే అనుసంధానం చేయబడి ఉందో.. ఆ ఖాతాలోకి నగదు బదిలీ చేస్తున్నారు. లాక్డౌన్ కాలంలో కూడా రైతులకు సహాయం చేయడానికి దాదాపు రూ .22 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

For More News..

దేశంలోనే మొదటిసారి అత్యధిక కరోనా కేసులు

విజయవాడలో కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

రాష్ట్రంలో మరో 1982 కరోనా కేసులు

Latest Updates