24 నుంచి దేశవ్యాప్తంగా ‘కిసాన్ సమ్మాన్’

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి రైతుల వివరాలివ్వడంలో తెలంగాణ  ముందుందని కేంద్ర వ్యవసాయ శాఖ అద నపు కార్యదర్శి వసుధ మిశ్రా ప్రశంసించారు. గురువారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, అధికారులతో ఆమె భేటీ అయ్యారు. కిసాన్ సమ్మాన్ అమలుపై చర్చించారు. ‘రాష్ట్రంలో అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ నెల 18 వరకు వివరాలు అందుతాయి. రైతుబంధు, కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధం
లేదు. 24న ఈ పథకం దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది.’ అని వసుధ మిశ్రా అన్నారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల లోపు పొలం ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు పంట సాయం అందిస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటించింది. దీని అమలుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

 

Latest Updates