రామజన్మభూమిని సందర్శించిన మొదటి ప్రధాని మోడీ

  • మాట ప్రకారం 29 ఏండ్ల తర్వాత అయోధ్యకు వచ్చిన మోడీ

అయోధ్య: ప్రధాని నరేంద్ర మోడీ తన మాట నిలబెట్టుకున్నారు. 29 ఏండ్ల తర్వాత అయోధ్యకు వచ్చారు. రామజన్మభూమిని దర్శించిన మొదటి ప్రధాని నరేంద్ర మోడీనే అని ఉత్తర్‌‌ప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పింది. తిరంగ యాత్ర కన్వీనర్‌‌గా మురళీమనోహర్‌‌ జోషీతో కలిసి మొదటిసారి వచ్చిన ప్రధాని మోడీ మళ్లీ శంకస్థాపన తర్వాతే వస్తానని అప్పట్లో చెప్పారు. ఈ మేరకు మోడీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. గతంలో కూడా చాలా సార్లు అయోధ్య దగ్గర వరకు వచ్చిన మోడీ.. అయోధ్యను మాత్రం సందర్శించింలేదని అధికారులు చెప్పారు. అయోధ్యను, హనుమాన్‌ గర్హీని సందర్శించిన మొదటి ప్రధాని నరేంద్ర మోడీ అని యూపీ ప్రభుత్వం చెప్పింది. మోడీ అప్పట్లో రామ జన్మభూమి సందర్శించినప్పటి ఫొటో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

Latest Updates