న్యూ ఇండియా అంటే 130 కోట్ల భారతీయుల వాయిస్: మోడీ

భారత్  సరికొత్త  దిశగా  అడుగులు  వేస్తోందన్నారు   ప్రధాని మోడీ. మనోరమ  న్యూస్  కాంక్లేవ్  సందర్భంగా  ప్రధాని మాట్లాడుతూ… న్యూ  ఇండియా  అంటే   ఏ కొందరి వాయిస్  కాదన్నారు. 130 కోట్ల  భారతీయుల  వాయిస్  అన్నారు. అభివృద్ధిలో  దేశం దూసుకెళ్తోందన్నారు.   జన్ ధన్  అకౌంట్లలో  లక్ష కోట్ల  రూపాయలు డిపాజిట్   చేసుకున్నారని , చాలా మంది   గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని  అన్నారు.  మార్పు చెందుతున్న  భారత్ లో  ప్రజలు  కేవలం   ప్రేక్షకుల్లా   ఉండిపోవాలనుకోవడం  లేదని, తాము కూడా  భాగస్వాములు  అవ్వాలనుకుంటున్నారని   మోడీ ప్రశంసించారు .

Latest Updates