దీపావళి వరకు పేదలకు ఉచితంగా రేషన్

దీపావళి వరకు పేదలకు ఉచితంగా రేషన్

న్యూఢిల్లీ: కరోనా కష్ట సమయంలో పేదలకు ఆకలి కష్టాలు లేకుండా చేసేందుకు ప్రధాని మోడీ అభయ హస్తం అందించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేదలకు ముఖ్యంగా వలసలు వెళ్లే దినసరి కూలీలు ఇబ్బందిపడకుండా ఉచిత రేషన్ దీపావళి వరకు కొనసాగించాలని నిర్ణయిచారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కింద మే, జూన్‌ నెలల్లో మాత్రమే దేశంలో దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ ఇవ్వాలని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు దాన్ని ఈ ఏడాది దీపావళి వరకు పొడిగించారు. లాక్ డౌన్ మొదటి దశలోని పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల వారికి ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసిన ప్రధాని మోడీ ఉచిత రేషన్ ఈ ఏడాది నవంబరు వరకు కొనసాగిస్తామని వెల్లడించారు. దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందజేస్తామని ప్రధాని మోడీ తెలిపారు.