మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. గడపదాటొద్దు

మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. గడపదాటొద్దని ప్రధాని మోడీ  ప్రజల్ని కోరారు. 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు చెప్పిన మోడీ.. అమెరికా, ఇటలీలో అత్యుత్తమ వైద్యసేవలున్నా కరోనా మహమ్మారి కంట్రోల్ కావడం లేదన్నారు. అడవుల్లో కార్చిచుల్లా ప్రజల్లో కరోనా వ్యాపిస్తుందన్నారు. కరోనా వైరస్ మొదటి లక్ష మందికి చేరడానికి 67రోజులు పట్టిందని, కేవలం 11రోజుల్లో ఆ సంఖ్య రెండు లక్షలకు చేరిందన్నారు. మరో నాలుగు రోజుల్లోనే 3 లక్షలకు చేరిందన్నారు. కరోనా వైరస్ కు మందులేదని, సురక్షితంగా ఉండాలంటే ప్రజలు ఇంట్లోనే ఉండాలని ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

 

 

 

 

Latest Updates