21రోజులు దేశం లాక్ డౌన్

21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మోడీ..ఈ లాక్ డౌన్ దేశం ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అయినా ఈ రోజు అర్ధరాత్రి నుంచి  21రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.  మీ కుటుంబసభ్యుడిలా చెబుతున్నా అందరూ ఇంట్లోనే ఉండండి. బయటకి రావడం మరిచిపోండని అన్నారు. 

21రోజులు నిలబడకపోతే 21ఏళ్లు వెనక్కిపోతాం

అర్ధ రాత్రి నుంచి దేశంలో 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని మోడీ..  జనతా కర్ఫ్యూ కంటే కఠినమైన కర్ఫ్యూ ఇదేనన్నారు. ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధమని చెప్పారు. ప్రతీ నగరం,ప్రతీ ఊరు,ప్రతీ వీధి లాక్డౌన్ లోకి వెళ్లాల్సిందేనన్న మోడీ ..కరోనా మహమ్మరిని జయించాలంటే ఈ స్వీయ నిబంధన తప్పదన్నారు.  లేకుంటే దేశం..మీ కుటుంబం 21 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుందన్నారు.  మీ ఇంటి గుమ్మం ముందు ఒక లక్ష్మణ రేఖ గీయండి..ఆ లక్ష్మణ్ రేఖను దాటకుండా ఇంట్లోనే ఉండాలని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. 

Latest Updates