మోడీ రూ. లక్ష పెట్టి కొన్న ప్లాట్ ఇప్పుడు కోటి దాటింది

ప్రధాని మోడీ ఆస్తి రూ.2.85 కోట్లు

గతేడాది కంటే రూ.36 లక్షలు ఎక్కువ

బ్యాంకు బ్యాలెన్స్, ఫిక్స్​డ్ డిపాజిట్లతో పెరిగిన విలువ

అప్పుల్లేవు.. ఒక్క కారు కూడా లేదని వెల్లడి

తమ ఆస్తులు ప్రకటించిన పీఎం, కేంద్ర మంత్రులు

అమిత్ షా ప్రాపర్టీ రూ.28.63 కోట్లు.. అప్పు 15.77 లక్షలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్ర మంత్రులు తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2020 జూన్ 30 నాటికి తన ప్రాపర్టీలు రూ.2.85 కోట్లు అని మోడీ పేర్కొన్నారు. అప్పులేవీ లేవని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆస్తుల వివరాలను పీఎంవో రిలీజ్ చేసింది. బ్యాంకు బ్యాలెన్స్ పెరగడం, బ్యాంక్ ఫిక్స్​డ్ డిపాజిట్ల విలువ పెరగడంతో గతేడాదితో పోలిస్తే మోడీ ఆస్తి రూ.36 లక్షలు పెరిగింది. ఏడాది కాలంలో సేఫ్ ఇన్వెస్ట్​మెంట్ల ద్వారా 33 లక్షలు, బ్యాంకు డిపాజిట్లలో మరో రూ.3.3 లక్షలు పెరిగాయి. తన ప్రాపర్టీ విలువ రూ.2.49 కోట్లని 2019లో మోడీ ప్రకటించారు. ఇక ఈక్విటీల్లో ఆయన ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు. తనకు కారులేదని వెల్లడించారు. అసలు తన వద్ద ఎలాంటి మోటార్ వెహికల్ లేదని చెప్పారు.

లైఫ్ ఇన్సూరెన్స్ కు 1,50,957

ప్రధానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. రూ.1,50,957 ప్రీమియంగా కడుతున్నారు. గతేడాది 1,90,347 ప్రీమియం కట్టారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు కూడా ఉన్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ద్వారా రూ.8,43,124 ట్యాక్స్ లు సేవ్ చేసుకున్నారు. గతేడాది రూ.7,61,646 సేవ్ చేసుకున్నారు.

ప్లాట్.. అప్పుడు లక్ష.. ఇప్పుడు కోటి..

గుజరాత్​లోని గాంధీనగర్ సెక్టార్ 1​లో తనకు ఓ ప్లాట్ ఉందని మోడీ పేర్కొన్నారు. ఆ ప్లాట్ 3,531 చదరపు అడుగులు ఉంది. ఈ ప్రాపర్టీకి మోడీతో సహా నలుగురు ఓనర్లు. ప్రతి ఒక్కరికి 25 % వాటా ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి సరిగ్గా రెండు నెలల ముందు 2002 అక్టోబర్ 25న ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. అప్పటికి దాని విలువ సుమారు రూ.1.3 లక్షలు. ఇప్పడు దాని మార్కెట్ విలువ సుమారు రూ.1.1 కోట్లు.

ప్రధాని ఆస్తుల లెక్క ఇదీ..

జూన్ చివరి నాటికి చేతిలో ఉన్న క్యాష్ రూ.31,450

బ్యాంకు బ్యాలెన్స్ రూ.3,38,173

2019 మార్చి 31 నాటికి బ్యాంకు బ్యాలెన్స్ రూ.4,143

గాంధీ నగర్ లోని ఎస్​బీఐలో ఉన్న ఫిక్స్​డ్ డిపాజిట్ల విలువ  రూ.1,60,28,939

గతేడాది ఇవే ఫిక్స్​డ్ డిపాజిట్ల విలువ రూ.1,27,81,574

45 గ్రాములు ఉన్న 4 బంగారు ఉంగరాలు రూ.1,51,875

గాంధీనగర్ లో ఉన్న ప్లాటు, ఇల్లు రూ.1.1 కోట్లు

(కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆస్తిలో భాగం ఉంది. వీటికి మోడీతో కలిసి నలుగురు ఓనర్లు ఉన్నారు.)

ఇన్​ఫ్రాస్ట్రక్చర్ బాండ్ రూ.20 వేలు (2012 జనవరిలో రూ.20 వేల విలువైన ఎల్&టీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ను మోడీ కొన్నారు.
అది ఇంకా మెచ్యూర్ కాలేదు.)

అమిత్ షా

హోం మంత్రి అమిత్ షా ఆదాయం గతేడాది కంటే భారీగా తగ్గిపోయింది. 2020 జూన్ నాటికి తనకు రూ.28.63 కోట్ల ప్రాపర్టీ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. గతేడాది షా ఆస్తి విలువ 32.3 కోట్లు. ఈయనకు 10 స్థిరాస్తులు గుజరాత్ లో ఉన్నాయి. ఈ స్థిరాస్తులు, తన తల్లి ద్వారా వారసత్వంగా వచ్చినవి కలిపి వాటి మొత్తం విలువ రూ.13.56 కోట్లు. ఆయన దగ్గర రూ.15,814 క్యాష్ ఉంది. బ్యాంకుల్లో 1.04 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఇన్సూరెన్స్, పెన్షన్ పాలసీల విలువ రూ.13.47 లక్షలు. ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీముల్లో రూ.2.79 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. 44.47 లక్షల విలువైన జ్యుయలరీ ఆయన వద్ద ఉన్నాయి. రూ.15.77 లక్షల అప్పు ఉంది.

రాజ్ నాథ్ సింగ్

స్థిర, చర ఆస్తులు కలిపి రూ.4.94 కోట్లు. గతేడాదితో పోలిస్తే పెద్దగా మారలేదు. స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్, పెన్షన్ పాలసీల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. పాయింట్ 32 రౌండ్ రివాల్వర్, 2 పైప్ గన్స్ ఆయన దగ్గర ఉన్నాయి. రాజ్ నాథ్ భార్య సావిత్రి సింగ్ దగ్గర రూ.54.41 లక్షల చరాస్తులు ఉన్నాయి.

నితిన్ గడ్కరీ

స్థిర, చర ఆస్తులు కలిపి రూ.18.95 కోట్లు. అయితే ఈ ప్రాపర్టీలన్నీ గడ్కరీతోపాటు ఆయన భార్య, ఫ్యామిలీ మెంబర్ల పేరుతో ఉన్నాయి. ఆరు వెహికల్స్ ఉన్నాయి.

నిర్మలా సీతారామన్

రెసిడెన్షియల్ ప్రాపర్టీ రూ.99.36 లక్షలు. 16.02 లక్షల విలువైన వ్యవసాయ భూమి నిర్మలతోపాటు ఆమె భర్త పేరుమీద ఉంది. ఒక్క ఫోర్ వీలర్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్​లో రిజిస్టర్ అయిన బజాజ్ చేతక్ ఉంది. దాని విలువ రూ. 28,200. ఇక 19 ఏళ్ల హోం లోన్, ఏడాది ఓవర్ డ్రాఫ్ట్, 10 ఏళ్ల మార్ట్​గేజ్ లోన్ ఉన్నాయి. చరాస్తుల విలువ రూ.18.4 లక్షలు.

రవిశంకర్ ప్రసాద్

మూడు స్థిరాస్తుల విలువ రూ.3.79 కోట్లు. ఇక మిగతా ఆస్తులు, ఇన్వెస్ట్​మెంట్లు కలిపి 16.5 కోట్లు.

పియూష్ గోయల్

ఆస్తుల విలువ రూ.27.47 కోట్లు. ఆయన భార్య సీమా గోయల్​కు రూ.50.34 కోట్ల ఆస్తి ఉంది. మొత్తంగా చూస్తే గోయల్ ఫ్యామిలీ ఆస్తుల విలువ 78.27 కోట్లు.

స్మృతి ఇరానీ

స్థిర, చరాస్తుల విలువ రూ.6.41 కోట్లు.

For More News..

రోడ్లను వెడల్పు చేసి సిటీని ముంచిన్రు

బీ కేర్‌ఫుల్.. వరద నీటితో రోగాల ముప్పు

మూసీని ఆక్రమించింది రాష్ట్ర సర్కారే

Latest Updates