భయపడొద్దు మీకు నేనున్నా.. అస్సాం ప్రజలకు మోడీ హామీ

‘సిటిజెన్ షిప్ బిల్’ కు వ్యతిరేకంగా అస్సాం ప్రజలు చేస్తున్న ఆందోళనలపై ప్రధాని మోడీ స్పందించారు. అస్సాం అక్కాచెల్లెల్లు, అన్నాతమ్ముల్లెవరూ అందోళన చెందవద్దని..సిటిజన్ షిప్ బిల్  అస్సాం ప్రజలకు వ్యతిరేకం కాదని… మీ హక్కులను ఎవరూ హరించడంలేదని ట్వీట్ చేశారు మోడీ. మీ అస్సాం గుర్తింపు, అందమైన కల్చర్ మరింత అభివృద్ధిచెందేలా భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని తిరిగి పంపించేలా తీసుకొచ్చిన సిటిజన్ షిన్ అమెండ్మెంట్ బిల్ ఇటు లోక్ సభలో, అటు రాజ్యసభలో బుధవారం ఆమోదం పొందింది…ఇక… రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లనుంది. సిటిజన్ షిప్ బిల్లు ను భారత్ తీసుకురావడాన్ని ఖండించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దీంతో పాటు కాంగ్రెస్ కూటమితో పాటు, టీఆర్ఎస్ సిటిజెన్ షిప్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది.

Latest Updates