మన చిన్నారులకు మోడీ అభినందన

న్యూఢిల్లీ:  బాల్‌‌‌‌‌‌‌‌ శక్తి అవార్డులు గెలిచిన తెలంగాణ షూటర్‌‌‌‌‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌, మౌంటెనీర్‌‌‌‌‌‌‌‌ సమన్యూ పోతురాజు, మెజీషియన్‌‌‌‌‌‌‌‌ దర్శ్‌‌‌‌‌‌‌‌ మలానీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు  బాల్‌‌‌‌‌‌‌‌ శక్తి పురస్కార్‌‌‌‌‌‌‌‌ అందుకున్న చిన్నారులు శుక్రవారం ఢిల్లీలో మోడీని కలిశారు. పది మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌లో నేషనల్‌‌‌‌‌‌‌‌ రికార్డు సాధించిన యంగెస్ట్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఇషాను అభినందించిన పీఎం ఆమెతో దిగిన ఫొటోను ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. యంగ్‌‌‌‌‌‌‌‌ ఏజ్‌‌‌‌‌‌‌‌లో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మౌంటెనీర్‌‌‌‌‌‌‌‌గా సమన్యూ సాధించిన ఘనత అద్భుతమని కొనియాడారు. అతను మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు మేజిక్‌‌‌‌‌‌‌‌ షోలు క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసిన దర్శ్‌‌‌‌‌‌‌‌ మలానీని కలవడం ఆనందంగా ఉందన్నారు. తన మేజిక్‌‌‌‌‌‌‌‌తో కార్గిల్‌‌‌‌‌‌‌‌ యుద్ధ వీరులతో పాటు అమర సైనికుల కుటుంబాలకు ఆనందాన్ని పంచిన దర్శ్‌‌‌‌‌‌‌‌ను చూసి అందరం గర్వపడుతున్నామని ఆయన ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు.

 

Latest Updates