మోడీ నాకంటే పెద్ద నటుడు : ప్రకాశ్ రాజ్

ప్రధాని మోడీ నటుడిగా మారారని విమర్శించారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు ప్రకాశ్ రాజ్. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కలిశారు ప్రకాశ్ రాజ్. తాను ఆప్ లో లేకపోయినా… ఆమ్ ఆద్మీ సిద్ధాంతం నచ్చిందన్నారు. నటించడంతో మోడీ నా కంటే పెద్ద నటుడు అన్నారు ప్రకాశ్ రాజ్

ప్రజలు నాయకులకు అధికారం అప్పజెప్పేది రాజ్యం చేయడానికి కాదని… సేవ చేయడానికి మాత్రమేనన్నారు. రెండు జాతీయ పార్టీలు జోకర్లుగా మారాయని మండిపడ్డారు. చేసిందేంటో చెప్పకుండా మోడీ పుల్వామా దాడి గురించే మాట్లాడుతున్నారని… అతడిని ఆపాల్సిన టైమ్ వచ్చిందన్నారు ప్రకాశ్ రాజ్.

Latest Updates