మోడీ టీనేజ్ లైఫ్ విశేషాలతో ‘మనో విరాగి’

ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘మనో విరాగి’. తెలుగు, తమిళ భాషలలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. తమిళంలో ‘కర్మయోగి’గా విడుదల చేయనున్నారు. ఎస్.సంజయ్ త్రిపాఠి రచన, దర్శకత్వంలో మహావీర్ జైన్‌‌తో కలిసి బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోడీ పాత్రలో అభయ్‌‌ వర్మ నటిస్తున్నాడు. గుజరాత్‌‌లోని వాద్ నగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలలో ఈ సినిమాను తీశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలో మూవీని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మోడీ పుట్టినరోజు కావడంతో ఆయనకు విషెస్ చెబుతూ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘లైకా’ సుభాస్కరన్ మాట్లాడుతూ ‘మోడీగారి టీనేజ్‌ లైఫ్‌లోని ముఖ్యమైన మలుపులతో తీస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సమర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం’ అన్నారు.

For More News..

కేంద్రం తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి రాజీనామా

కరోనా గురించి ఆలోచిస్తూ.. ఆ వ్యాధిని మరవొద్దు

8 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రిక్రూట్‌‌మెంట్‌‌

Latest Updates