దేశవ్యాప్తంగా బీజేపీ సేవాసప్త్

ఢిల్లీ : ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నేతలు సేవా సప్త్ కార్యక్రమం ప్రారంభించారు. సేవాసప్త్ లో భాగంగా ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నడ్డా, ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. హాస్పటల్ లో చికిత్స పొందుతోన్న చిన్నారులను కలిసి పండ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత హాస్పిటల్ లో ఫ్లోర్ క్లీనింగ్ చేశారు అమిత్ షా. మోడీ జీవితం దేశానికి అంకితం చేశారన్నారు అమిత్ షా. అందుకే మోడీ బర్త్ డేను ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో సేవాసప్త్ ప్రారంభించామన్నారు.

Latest Updates