మోడీ గంగా విహారం

కాన్పూర్: ప్రధాని నరేంద్రమోడీ గంగా నదిలో శనివారం బోటులో ప్రయాణించారు.  కాన్పూర్​ అటల్​ ఘాట్​ దగ్గర  ‘నమామి గంగా’ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు.  సుమారు అరగంట సేపు బోటులో గంగానదిలో తిరిగారు. నది ఒడ్డున నిలుచున్న జనాలకు  చేతులు ఊపుతూ మోడీ అభివాదం చేశారు. ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​, బీహార్​ డిప్యూటీ సీఎం సుశీల్​ మోడీ  ఆయనతోపాటు ఉన్నారు.  అంతకుముందు ఢిల్లీ నుంచి నేరుగా కాన్పూర్​ వెళ్లిన  మోడీ  మొదటిసారి జరుగుతున్న  ‘నమామి గంగా’ కౌన్సిల్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

బీజేపీ సర్కార్​ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన  ‘నమామి గంగా’ ప్రాజెక్టును రివ్యూచేశారు.  గంగను పరిశుభ్రంగా ఉంచడానికి జరుగుతున్న పనుల ప్రగతిని  ఆయన అడిగి తెలుసుకున్నారు.   యూపీ, ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రులతోపాటు కేంద్రమంత్రులు ప్రకాశ్​ జవదేకర్​, గజేంద్రసింగ్​ షెకావత్​, హర్షవర్థన్​, ఆర్​కె సింగ్​, ప్రహ్లాద్​ పటేల్​, మున్సుఖ్​ మండవియా, హర్​దీప్​ సింగ్​ పురి,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్​అధికారులు రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. నమామి గంగా మిషన్​ ఎగ్జిబిషన్​ ను కూడా ప్రధాని  చూశారు.  ఉదయం ఎయిర్​పోర్ట్​లో యూపీ సీఎం ఆదిత్యనాథ్​, ఇతర  ఉన్నతాధికారులు ప్రధానికి స్వాగతం పలికారు.

నమామి గంగా అంటే?

కలుషితమైన గంగా నదిని క్లీన్‌‌‌‌ చేసి, పొల్యూషన్‌‌‌‌ లేకుండా చేసే ఉద్దేశంతోనే 2014లో మోడీ ప్రభుత్వం ‘నమామి గంగ’ ప్రోగ్రామ్‌‌‌‌ను ప్రారంభించారు. దీని కోసం ఐదేళ్ల కాలానికి మోడీ ప్రభుత్వం 20వేల కోట్ల రూపాయలు కేటాయించింది. మొత్తం మూడు దశల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా మురుగునీటిని శుభ్రంగా మార్చడం, రివర్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, నది ఉపరితలాన్ని శుభ్రపరచడం, మొక్కల్ని పెంచడం, పబ్లిక్‌‌‌‌ ఎవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌, పరిశ్రమల నుంచి వచ్చే పొల్యూషన్‌‌‌‌పై పర్యవేక్షణ, గంగా నది తీరంలోని 4470 గ్రామాలను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు. గంగా నదిని పొల్యూషన్‌‌‌‌ ఫ్రీ చేసేందుకు ఐదు రాష్ట్రాలకు ఫండ్‌‌‌‌ను  కూడా ఇచ్చారు. గంగా నదిని శుభ్రం చేసేందుకు నేషనల్‌‌‌‌ మిషన్‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌ గంగా విదేశాల్లో అమలవుతున్న పద్ధతుల్ని కూడా ఉపయోగించుకోవాలని
చూస్తోంది.

Latest Updates