రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కుట్ర: రేవంత్

SC,ST లకు అణగారిన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. అయితే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీయడంతో పాటు.. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల రిజర్వేషన్లకు వ్యతిరేకులైన ఈ ఇద్దరిపైనా దండయాత్ర చేయాల్సిన అవసరం ఉందన్నారు. SC,ST రిజర్వేషన్లు పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత  పార్లమెంట్ లో సవరణను కేంద్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

Latest Updates