జన్‌ధన్ అకౌంట్లలో రూ.లక్షకోట్లు డిపాజిట్ అయ్యాయి : మోడీ

మెడికల్  టూరిజంను  మరింత  అభివృద్ధి  చేయాలన్నారు  ప్రధాని మోడీ. ఫిట్  ఇండియా  మూమెంట్ కు  ఆయుష్ శాఖకు  సంబంధం  ఉందన్నారు. దేశవ్యాప్తంగా  12 వేల 500  ఆయుష్  సెంటర్లు  ఏర్పాటు చేయాలన్నది  తమ  లక్ష్యమన్నారు మోడీ.  10 ఆయుష్   హెల్త్ అండ్  వెల్ నెస్  సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ ఏడాది   4 వేల ఆయుష్  సెంటర్లను ఏర్పాటు  చేస్తామన్నారు. ఈ  సందర్భంగా  విజ్ఞాన్ భవన్ లో యోగా  అవార్డులను  అందజేశారు.

భారత్  సరికొత్త  దిశగా  అడుగులు  వేస్తోందన్నారు  ప్రధాని మోడీ. మార్పు చెందుతున్న  భారత్ లో ప్రజలు  కేవలం ప్రేక్షకుల్లా   ఉండిపోవాలనుకోవడం  లేదని, తాము కూడా  భాగస్వాములు  అవ్వాలనుకుంటున్నారని  మోడీ ప్రశంసించారు. మనోరమ  న్యూస్ కాంక్లేవ్  సందర్భంగా  ప్రధాని మాట్లాడారు.

అభివృద్ధిలో  దేశం దూసుకెళ్తోందన్నారు ప్రధాని.  జన్ ధన్  అకౌంట్లలో లక్ష కోట్ల  రూపాయలు డిపాజిట్    చేసుకున్నారని, చాలా మంది  గ్యాస్  సబ్సిడీని వదులుకున్నారని చెప్పారు.

Latest Updates