రామ భక్తి, రహీం భక్తి కాదు… దేశ భక్తి కావాలి: మోడీ

అయోధ్య వివాదాస్పద స్థలం పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు ప్రధాని నరేంధ్ర మోడీ. అయితే ప్రజలకు రాముని భక్తో, రహీం భక్తో ముఖ్యం కాదని దేశ భక్తే అంతిమమని చెప్పారు. అన్ని మతాల పెద్దలు సుప్రీం తీర్పును స్వాగతించడం మంచి పరిణామమని చెప్పారు. దేశ ప్రజలందరూ శాంతి యుతంగా ఉండాలని కోరారు. ఇది ఒకరికి విజయం కాదని మరొకరికి అపజయం కాదని తెలిపారు. ఈ దేశానికి కావలసినది శాంతి స్థాపన అని అన్నారు.

అయోధ్య వివాదంలో ఉన్న భూమిని హిందువులకు చెందినదిగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మస్లింలకు ఐదెకరాల భూమిని కెటాయించాల్పిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయోధ్య తీర్పు వెలువడుతున్న సంధర్భంలో దేశవ్యాప్తంగా పోలీసులను అలెర్ట్ చేసింది కేంద్ర హోంశాఖ.

Latest Updates