ఒడిశా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ ఏరియల్ వ్యూ

ఒడిశా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు ప్రధాని మోడీ. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వేగంగా కొనసాగిస్తామన్నారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బాగా పని చేసిందని, ప్రభుత్వ హెచ్చరికలను ప్రజలు పాటించడంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని చెప్పారు. దీంతో ప్రాణనష్టం తగ్గిందన్నారు మోడీ. 12 లక్షల మందిని తక్కువ సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడం అంత సులువు కాదని, అయినా సుసాధ్యం చేశారన్నారు మోడీ.

ప్రధాని మోడీ.. ఒడిశా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ చేశారు. ప్రధానితో పాటు ఒడిశా గవర్నర్ గణేషి లాల్, సీఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తదితరులు ఫొని తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. భువనేశ్వర్ లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.

Latest Updates