జపాన్ కొత్త ప్రధానికి మోడీ కంగ్రాట్స్

న్యూఢిల్లీ: జపాన్ కొత్త ప్రధానిగా యొషిహిడే సుగా ఎన్నికయ్యారు. మాజీ పీఎం షింజో అబే స్థానంలో ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సుగాకు అభినందనలు తెలుపుతూ భారత ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రత్యేక వ్యూహంతో గ్లోబల్ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో కలసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానని మోడీ చెప్పారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త ప్రధాని కోసం పార్లమెంటరీ ఓటు విధానంలో సంప్రదాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించగా.. ఈ ఎలక్షన్స్‌‌లో సుగా విజయం సాధించారు.

Latest Updates