ట్విట్టర్‌‌లో మోడీ హవా.. హయ్యస్ట్ ఫాలోవర్స్‌

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాను ఎంత ఎఫెక్టివ్‌గా వాడతారో తెలిసిందే. ప్రజల్లోకి తన సందేశాలను తీసుకెళ్లడానికి, వారితో మమేకం కావడానికి సోషల్ మీడియాను ఆయన అస్త్రంగా వినియోగిస్తారు. అందుకే పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌‌లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌‌లో ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన నాయకుల్లో మోడీ ఒకరు. తాజాగా మోడీ ట్విట్టర్‌‌ అకౌంట్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఆయన హవాను తెలుపుతోంది. ట్విట్టర్‌‌లో మోడీని అనుసరిస్తున్న వారి సంఖ్య 60 మిలియన్లు దాటింది. తద్వారా ట్విట్టర్‌‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన ఇండియన్‌గా మోడీ నిలిచారు.

మోడీ 2009 నుంచి ట్విట్టర్‌‌ను యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోడీ ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ట్విట్టర్‌‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను కలిగిన లీడర్స్‌లో మోడీ మూడో ప్లేస్‌లో ఉన్నారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా 120 మిలియన్ ఫాలోవర్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఒబామా తర్వాత 83 మిలియన్ ఫాలోవర్స్‌తో ప్రస్తుత అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

Latest Updates