రాష్ట్రపతితో భేటీ అయిన ప్రధాని మోడీ

  • ప్రస్తుత పరిస్థితులపై చర్చ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న అంశాలపై వాళ్లిద్దరు చర్చించుకున్నట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకి వచ్చినట్లు చెప్పారు. ఇరువురు భేటీ అయిన ఫొటోలను రాష్ట్రపతి భవన్‌ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. “ ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌తో భేటీ అయి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు” అని ట్వీట్‌ చేశారు. చైనాతో బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీళ్లద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు దేశాల మధ్య టెన్షన్‌ నెలకొన్న తర్వాత ప్రధాని మోడీ రాష్ట్రపతిని కలవడం ఇదే మొదటిసారి. రెండురోజుల క్రితం మోడీ లేహ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.

Latest Updates