ప్రధాని మోడీకి ఆ ధైర్యముందా: రాహుల్ సవాల్

పోలీసులు లేకుండా దేశంలోని యూనివర్శిటీలకు వెళ్లి.. అక్కడి విద్యార్థులను కలిసే దమ్ము ప్రధాని నరేంద్ర మోడీకి ఉందా? అని సవాల్‌ విసిరారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ. సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సోనియాగాంధీ అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ భ్రష్టు పట్టించారని.. దానిపై విద్యార్థులకు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ముందు నిలబడటానికి ఆయనకు ధైర్యం లేదన్నారు.  ఏదైనా విశ్వవిద్యాలయానికి పోలీసులు లేకుండా వెళ్లి, అక్కడ ఈ దేశం కోసం ఏమి చేయబోతున్నాడో ప్రజలకు చెప్పాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. మోడీ దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యువత గొంతును అణిచివేయడం మంచిది కాదు. ప్రభుత్వం తప్పక వినాలని ఆయన అన్నారు.

Latest Updates