బెంగాల్ మమత, ఆమె అల్లుడి జాగీరు కాదు : ప్రధాని మోడీ

pm-modi-fires-on-mamatha-benerjee-and-her-nephew-227147-2

యూపీ, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఎన్నికల ప్రచారం చేశారు. యూపీలోని మధురాపూర్, వెస్ట్ బెంగాల్ లోని డండం బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై సీరియస్ అయ్యారు.

టీఎంసీ గుండాలే కోల్ కతాలో హింసకు పాల్పడ్డారని, విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ప్రధాని మోడీ ఆరోపించారు. నారదా,శారదా కుంభకోణాల్లో ఆధారాలు మాయం చేసిన మమత సర్కార్.. విగ్రహ ధ్వంసం దాడికి సంబంధించిన అధారాలను మాయం చేస్తుందని మోడీ అన్నారు.

ఇదేమైనా మీ జాగీరనుకుంటున్నారా..? : మోడీ

ప్రచారానికి వస్తే దాడులు చేయించారనీ.. ఇది సరికాదని అన్నారు మోడీ. గతంలో కమ్యూనిస్టులు… మమత బెనర్జీకి ఇలాంటి పరిస్థితులే కల్పించారని చెప్పిన మోడీ… ఇపుడు తృణమూల్ కాంగ్రెస్.. బీజేపీకి అలాంటి అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయం, చట్టం తమ పని తాము చేశాయి కాబట్టే.. ఇవాళ మమత బెనర్జీ సీఎం అయ్యారని మోడీ చెప్పారు. ఈ విషయం దీదీ మరిచిపోవద్దని హితవు పలికారు. ఇంకెవ్వరూ ఇక్కడకు రావొద్దని చెప్పడానికి వెస్ట్ బెంగాల్ మీ జాగీరు కాదు అని ఘాటుగా విమర్శించారు మోడీ.

Latest Updates